ఏసీబీ వలలో 'బినామీ' వార్డెన్.. ఏఎస్డీబ్ల్యూవో బాలాజీ లీలల్లో వాటా..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-20 10:15:36  IST  )

కదిరి బీసీ వసతిగృహం వార్డెన్ జయరామిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలు స్థానికంగా కలకలం రేపాయి. ..

ఏసీబీ వలలో బినామీ వార్డెన్..  ఏఎస్డీబ్ల్యూవో బాలాజీ లీలల్లో వాటా..!
X

దిశ, వెబ్ డెస్క్: కదిరి బీసీ వసతిగృహం వార్డెన్ జయరామిరెడ్డి(Kadiri BC Hostel Warden Jayaram Reddy) ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB officials) నిర్వహించిన సోదాలు(Searches) స్థానికంగా కలకలం రేపాయి. ఫిబ్రవరి 5న లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన బీసీ సహాయ సంక్షేమ అధికారి (ASWO) బాలాజీ కేసులో విచారణ జరుపుతుండగా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలాజీ సాగిస్తున్న అక్రమ వసూళ్లకు, అవినీతి లావాదేవీలకు జయరామిరెడ్డి ప్రధాన బినామీగా వ్యవహరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో అధికారులు దాడులు చేపట్టారు.

కీలక పత్రాల స్వాధీనం

సోదాల్లో భాగంగా జయరామిరెడ్డి నివాసంలో కీలక పత్రాలను, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సోదాల ద్వారా బాలాజీ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో, ఇంకా ఎవరెవరు ఈ అవినీతి భాగోతంలో ఉన్నారనే కోణంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే ఒక హాస్టల్ వార్డెన్ స్థాయిలో ఉండి ఉన్నతాధికారికి ఏజెంట్‌గా మారి ఇంతటి భారీ అవినీతికి పాల్పడటంపై విమర్శలు వినిస్తున్నాయి.

Next Story