- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: తేనెటీగల దెబ్బకు పరుగో పరుగో.... ఇద్దరి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా మండలం ఎల్. తండాలో అధికారులను తేనెటీగలు పరుగులు పెట్టించాయి..

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) మండలం ఎల్. తండా(L.Tanda)లో అధికారులను తేనెటీగలు(Bees) పరుగులు పెట్టించాయి. నీరు-చెట్టు(Water-Tree) పనుల్లో అవినీతి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆరుగురు ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టేందుకు ఎల్.తండాకు వెళ్లారు. ఈ క్రమంలో అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అధికారులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అయినా తేనెటీగలు వెంటపడి మరీ దాడి చేశాయి. నలుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే తేనెటీగల దాడి యాధృశ్చికంగా జరిగిందా.. అధికారుల విచారణ నేపథ్యంలో ఎవరైనా కుట్రకు దిగారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తేనెటీగల దాడి ఎలా జరిగిందని స్థానికుల నుంచి ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా కర్నూలు జిల్లా ఇరిగేషన్ శాఖ పరిధిలో 2017-18లో నీరు చెట్టు కార్యక్రమం జరిగింది. ఈ పథకం కింద చెక్ డ్యాములు, ఇతర కాల్వ పనులు జరిగాయి. ఈ పనుల్లో అవినీతి జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా అధికారుల బృందం గ్రామానికి వెళ్లిన క్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(Vigilance and Enforcement)కు చెందిన ఆనంద్ బాబు, కేసీ కెనాల్(Casey Canal) ఇంజినీర్ కృష్ణ ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.






