Nandyala: పది పాస్ అయ్యారా..? ఈ జాబ్ మీకోసమే..!

by Disha Web Desk 16 |
Nandyala: పది పాస్ అయ్యారా..? ఈ జాబ్ మీకోసమే..!
X

దిశ, నంద్యాల: నంద్యాల జిల్లా పరిధిలోని 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5 అంగన్‌వాడీ, 5 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీటీఆర్ఎం చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు పది పాసై, మినీ

అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ ఆయా పోస్టుకు 7 వ తరగతి పాస్ కావాలన్నారు. వయస్సు 1.7.2022 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 ఏళ్లలోపు ఉండాలన్నారు. వివాహమై అదే గ్రామంలో నివాసం ఉండాలన్నారు. నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించనున్నట్లు పేర్కొన్నారు.

ఖాళీల వివరాలకు సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. నోటీస్ బోర్డులో చూసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సీడీపీఓ, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సాధికారత అధికారణిని సంప్రదించాలని కోరారు. అలాగే http://nandyal.ap.gov.in/ను పరిశీలించాలని, దరఖాస్తు వెంట సెల్ఫ్ అటెస్టేషన్ చేయించి జిరాక్సు ధ్రువ పత్రాలను సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో మే 1 సాయంత్రంలోపు సమర్పించాలని సూచించారు.



Next Story