- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nandyala: ఆ బోటు టూరిజం శాఖది కాదు
by Vemula.Srinu Prasad |
అవుకు జలాశయంలో ప్రమాదానికి గురైన బోటు ఏపీ టూరిజం శాఖది కాదని ఏపీ టూరిజం శాఖ పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు...

X
దిశ, నంద్యాల: అవుకు జలాశయంలో ప్రమాదానికి గురైన బోటు ఏపీ టూరిజం శాఖది కాదని ఏపీ టూరిజం శాఖ పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుకు జలాశయంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి 12 మంది గల్లంతయ్యారని..సంబంధిత బోటు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారన్నారు. జలాశయంలో బోటు నడిపేందుకు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిచ్చామన్నారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న బోటు రెన్యువల్‌కు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదన్నారు. రెన్యువల్ కాకపోయినా బోటు నడిపి ప్రమాదానికి కారకులయ్యారన్నారు. కాకినాడకు చెందిన ఏపీ మెరైన్ బోర్డు అధికారులు బోటుని తనిఖీ చేశారని..అనుమతిస్తూ లైసెన్స్ రెన్యువల్స్ మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్రతి సంవత్సరం బోటు రెన్యువల్‌కు సంబంధించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుందని సత్యనారాయణ పేర్కొన్నారు.
Next Story






