- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్చురీలో కొడుకు మృతదేహం.. బయట తల్లడిల్లిపోతున్న తల్లి
కర్నూలు ప్రభుత్వం ఆస్పత్రి మార్చురీ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) చిన్నటేకూరు వద్ద బైక్(Byke)ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో బస్సు(Bus)లో మంటలు రేగి 20 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో బైకర్ శివశంకర్ సైతం మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం శివశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయితే మార్చురీ దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశంకర్ తల్లి తల్లడిల్లీపోతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కొడును తలుచుకుని మరీ కన్నీరు మున్నీరు అవుతున్నారు.
‘‘రాత్రి 9.30 గంటలకు నా కొడుకు ఫోన్ చేశాడు. శివశంకర్ గ్రానైట్ పని చేస్తాడు. ప్రతి రోజు 8 గంటలకే ఇంటికి వచ్చేస్తాడు. డోన్‌లో ఉన్నానని, 10.30 గంటలకల్లా ఇంటికి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు.. ఇంటికి వస్తాడులే అనుకున్నాం. కానీ తమకు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. ప్రమాదం జరిగిందని, శివశంకర్ చనిపోయాడని, మృతదేహం పోస్టుమార్టం వద్ద ఉందని చెప్పారు.’’ అని శివవంకర్ తల్లి తెలిపారు.






