- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత ప్రేమికులకు 'గుడి' శిక్ష: మూడు లక్షల కోసం గ్రామ పెద్దల నిర్బంధం
కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం పొలకల్లులో హైడ్రామా చోటు చేసుకుంది. వివాహమై ఒక బాబు ఉన్నప్పటికీ, పాత ప్రేమికుడు ఎర్రమలతో కలిసి వెళ్లిపోయిన హైమావతి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది....

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) సి.బెలగల్ మండలం పొలకల్లు(Polakallu)లో హైడ్రామా చోటు చేసుకుంది. వివాహమై ఒక బాబు ఉన్నప్పటికీ, పాత ప్రేమికుడు ఎర్రమలతో కలిసి వెళ్లిపోయిన హైమావతి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగు నెలల క్రితం భర్త రాజేష్‌ను వదిలి వెళ్ళిపోయిన ఈ జంటను గ్రామానికి పిలిపించిన పెద్దలు, మారెమ్మ దేవాలయంలో బంధించడం స్థానికంగా కలకలం రేపింది.
భార్యను వదులుకున్నందుకు పరిహారం
ఈ వివాదానికి ప్రధాన కారణం పంచాయితీలో నిర్ణయించిన 'నష్టపరిహారం'. భార్యను వదులుకున్నందుకు గానూ రాజేష్‌కు మూడున్నర లక్షల రూపాయలు చెల్లించాలని పెద్దలు గతంలో తీర్పునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే 50 వేల రూపాయలు చెల్లించగా, మిగిలిన మూడు లక్షల కోసం ఎర్రమల, హైమావతిలను పులకుర్తి నుంచి బలవంతంగా తీసుకొచ్చి గుడిలో నిర్బంధించారు. డబ్బులు కట్టే వరకు వదిలే ప్రసక్తే లేదని పెద్దలు భీష్మించడంతో ఉద్రిక్తత నెలకొంది.
పీఎస్‌కు ప్రేమికులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుడిలో బంధీలుగా ఉన్న ప్రేమికులను విడిపించి స్టేషన్‌కు తరలించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తులను నిర్బంధించడం నేరమని హెచ్చరించిన పోలీసులు.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.






