ఆళ్లగడ్డలో హై టెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి Vs భూమా అఖిలప్రియ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-02 14:36:38  IST  )

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ...

ఆళ్లగడ్డలో హై టెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి Vs భూమా అఖిలప్రియ
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాల ఆళ్లగడ్డ(Allagadda)లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి(Av Subbareddy) కాంప్లెక్స్ గోడను అడ్డుగా ఉందని టీడీపీ(Tdp) నాయ‌కులు జేసీబీల‌తో కూల్చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుకుంది. అయితే కాంప్లెక్స్ వద్దకు వెళ్లకుండా ఏవి సుబ్బారెడ్డిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ‌( Tdp Mla Bhuma Ahila Priya)నే చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా గోడను ఎలా కూలిస్తారంటూ ప్రశ్నించారు. పార్టీ పెద్దలతో మాట్లాడి అఖిల‌ప్రియ‌ చిట్టా బయట పెడతానని హెచ్చరించారు. ఏవీ సుబ్బారెడ్డి అంటే ఏంటో చూడు అంటూ అఖిలప్రియకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.

భూ వివాదంతో...


కాగా భూమా నాగిరెడ్డి మరణాంతరం తలెత్తిన భూ వివాదంతో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిల ప్రియ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడులకు ప్రయత్నాలు సైతం జరిగాయి. కొద్దిరోజులుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ ప్రశాంతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన కాంప్లెక్ గోడను కూల్చివేయడంతో ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ మళ్లీ మొదలైందని స్థానిక టీడీపీ నేతలే అంటున్నారు.

Next Story