Kurnool: మోసం.. బెదిరింపులు: బీజేపీ అధ్యక్షుడిపై కేసు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-19 11:17:39  IST  )

బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తోట రామకృష్ణపై ఆదోనిలో కేసు నమోదైంది. అవని గోల్డ్ సంస్థకు చెందిన భూమిని ఇప్పిస్తానని నమ్మించి, తన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేశారని ప్రశాంత్ అనే వ్యక్తి ఆదోని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ..

Kurnool: మోసం.. బెదిరింపులు: బీజేపీ అధ్యక్షుడిపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తోట రామకృష్ణ(BJP Kurnool district president Thota Ramakrishna)పై ఆదోనిలో కేసు నమోదైంది. అవని గోల్డ్ సంస్థ(Avani Gold Company)కు చెందిన భూమిని ఇప్పిస్తానని నమ్మించి, తన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేశారని ప్రశాంత్ అనే వ్యక్తి ఆదోని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒప్పందం ప్రకారం భూమి ఇప్పించకపోవడంతో పాటు, తమ చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అడితే తోట రామకృష్ణ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడితో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో బాధితుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఆదోని మూడో పట్టణ పోలీసులు తోట రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story