- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం.. కడుపునొప్పితో ఆస్పత్రికెళ్తే డెలివరీ
తొమ్మిదో తరగతి బాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. రెండ్రోజులకు మగ బిడ్డకు జన్మనిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. రోజూ 14 ఏళ్ల బాలికను స్కూలుకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ తన స్నేహితుడితో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరూ రోజుల తరబడి లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. మార్చి 28న విద్యార్థిని అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో గర్భవతి అని, నెలలు కూడా నిండాయని తేలింది. ఈ క్రమంలో సోమవారం అంటే మార్చి 30న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక ప్రసవించడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.
జరిగిన విషయంపై పోలీసులు ఆరా తీయగా.. తనను స్కూలుకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర, మరో వ్యక్తి తెలుగు శివకుమార్ తో కలిసి లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. విషయం బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించడంతో ఇంట్లో చెప్పలేదని వాపోయింది. కాగా.. ప్రస్తుతం బాలికను, బిడ్డను స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారుల సంరక్షణలో ఉంచారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారికోసం గాలిస్తున్నారు.






