- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు : మరోసారి కుప్పకూలిన టమోటా ధరలు
ప్రతి ఏడాది ఇదే పరిస్థితి అంటున్న రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకోలు.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా మార్కెట్లో టమోటా (Tomato) పంటకు గిట్టుబాటు ధర (MSP) లభించడం లేదు. టమోటా ధరలు మరోసారి దారుణంగా పడిపోవడంతో రైతులు (Farmers) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా మార్కెట్‌లో నిలకడగా ఉన్న ధరలు అకస్మాత్తుగా పతనం కావడంతో పత్తికొండ, ప్యాపిలి వంటి ప్రధాన మార్కెట్లలో కిలో టమోటా ధర కేవలం రూ.5 కు పడిపోయింది. ఆరుగాలం కష్టపడి, లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు బాధపడుతున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్‌కు (Market) తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు, కూలీల వేతనాలు (Workers Wages) కూడా రావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక, మార్కెట్‌కు తరలిస్తే నష్టాలు తప్పవని భావించిన కొందరు రైతులు టమోటాలను రోడ్లపై పారబోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్లను (Tomato Processing Units) ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌లో దళారుల ప్రభావం పెరగడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.






