- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండికోట బాలిక హత్య కేసు.. డి.ఐ.జి కోయ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
గండికోట బాలిక హత్య కేసులో విచారణ ముమ్మరంగా జరుగుతోందని కర్నూలు రేంజ్ డి.ఐ.జి కోయ ప్రవీణ్ పేర్కొన్నారు...

దిశ, ప్రతినిధి, కడప: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మైనర్ బాలిక గండికోటలో దారుణ హత్యకు సంబంధించి విచారణ ముమ్మరంగా జరుగుతోందని కర్నూలు రేంజ్ డి.ఐ.జి కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జమ్మలమడుగు మండలం గండికోటలో దారుణహత్యకు గురయ్యారు. శనివారం అర్థసంవత్సర క్రైం మీటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన జిల్లా పరిషత్ ఆవరణంలో విలేకరులతో మాట్లాడారు. తమ ప్రాథమిక అంచనా ప్రకారం మైనర్ బాలిక హత్య మధ్యాహ్నాం 11.45 గంటల నుండి 1.45 గంటల మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉండవచ్చని తాము ప్రాథమిక అంచనా వేసామని చెప్పారు.
ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథస్వామి కాని, ఆలయం, పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు అందుబాటులో లేక పోవడం వల్ల పూర్తిగా టవర్ డంప్ అనాలసిస్ పైనే మా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ రెండు గంటల సమయంలో ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో, ఆ ప్రదేశంలో రెండు సెల్ టవర్స్ సిగ్నల్స్ వస్తున్నాయని, ఒకటి గండికోట, రెండవది నది అవతలి వైపు కొండ ప్రక్కనే ఉన్న గ్రామంలో జాతర జరుగుతోందన్నారు. అన్నింటిని న్యారోడౌన్ చేసిన తర్వాత , ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ రెండు గంటల సమయంమలో ఆ రెండు టవర్లలలో కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్లు నిర్థారణకు వచ్చామన్నారు. వారి కోసం టీమ్ పంపామని, వారు ఏ, ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లు తిరిగి టీమ్ ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నారన్నారు.
ప్యూర్ టెక్నికల్ అనాలసిస్
ఒక విధంగా చెప్పాలంటే మనం చేస్తున్నది ఏమిటంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు దిశగా మన ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కేసును ఖచ్చితంగా చేధిస్తామన్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు లేక పోవడం, తర్వాత పరోక్షంగా సామాజిక మాద్యమాలలో కుటుబ సభ్యుల వైపు వేలు ఎత్తి చూపుతున్నారన్నారు. పూర్తిగా టెక్నికల్ పైనే ఆధారపడి ఉన్నామన్నారు. అన్ని రకాలుగా అన్ని చూశాక అవసరమైతే కుటుంబ సభ్యులను కూడ విచారిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎవరూ తమ అదుపులో లేరన్నారు. ఈ కేసును ఎప్పటిలోగా చేధిస్తారన్న ఓ విలేకరి ప్రశ్నకు డి.జి.ఐ స్పందిస్తూ తమ వద్ద దివ్యశక్తులు లేవని మానవ శక్తితో చేధించగలుగుతామన్నారు.






