Kurnool: అమానవీయ ఘటన.. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకు

by Ramesh Goud |
Kurnool: అమానవీయ ఘటన.. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన అమానవీయ ఘటన కర్నూలు జిల్లా(Kurnool District)లో చోటుచేసుకుంది. సమాజంలో మానవత్వం రోజురోజుకి అడుగంటి పోతోంది. కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులు వృద్దాప్యంలోకి రాగానే పుత్రులకు భారంగా మారుతున్నారు. పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. పత్తికొండ(Pathikonda)లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు(srinivasulu) అనే వ్యక్తికి తన తల్లి తిరుపతమ్మ(Mother Thirupathamma)ను సాకటం భారంగా మారింది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను ఆదివారం ఉదయం పత్తికొండలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాలనీలో వదిలేసి వెళ్లిపోయాడు. నడవలేని స్థితిలో దీనంగా కూర్చిలో పడి ఉన్న వృద్దురాలిని చూసి చలించిపోయిన కొందరు కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తిరుపతమ్మను పత్తికొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆ వృద్దురాలు మాట్లాడుతూ.. తన కొడుకు డబ్బు కోసం రోజూ తనతో గొడవ పడతాడని వాపోయింది. తన భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పని చేసి చనిపోయాడని, భర్త చనిపోయినందుకు వచ్చే పింఛన్ కొడుకే తీసుకొని, ఇప్పుడు తీసుకోలేదని గొడవ పెట్టుకొని వదిలేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story