- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూల్‌లో కాల్పుల కలకలం
by Naga Rani Yarlagadda |
కర్నూల్ లో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. కారులో తిరుగుతూ ఇద్దరు వ్యక్తులు నగరంలోని వీఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ లో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. కారులో తిరుగుతూ ఇద్దరు వ్యక్తులు నగరంలోని వీఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారి అరుపులతో ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఒకరిని రోహిత్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఓ మ్యాచ్‌లో ఓడిపోవడంతోనే గాల్లో కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులకు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ ఉందా లేదా అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
Next Story






