- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుణుడు ఉగ్రరూపం.. కర్నూలు జిల్లా అతలాకుతలం
ఒక్కసారిగా కురిసి వర్షంతో కర్నూలు జిల్లా అతలాకుతలం అయింది....

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో వరుణుడు(Rains) ఉగ్రరూపం దాల్చాడు. ఎడతెరిపి లేకుండా కురిశాడు. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం(Water) అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు కాలనీలు నీట మునిగాయి. విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. వర్షాల దెబ్బకు పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. అత్మకూరులో 10 మండలాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. 30 గ్రామాలు జలమయం అయ్యాయి. సిద్దాపురం చెరువులో 21 అడుగులకు వర్షపు నీరు చేరింది. దీంతో ఒక్కసారిగా ఉప్పొంగింది. బైర్లూటి, గాలేరు అలుగులు రోడ్లపైకి పారాయి. దీని ఎఫెక్ట్‌తో అటుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. మొక్కజొన్న, కంది, సోయాబీన్, పత్తి, అరటి, టమాటో,ఉల్లి, పసుపు పంటలు నీళ్ల పాలయ్యాయి. మట్టి మిద్దెలు, పూరిళ్లు నేలకూలిపోయాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా తీర ప్రాంత గ్రామాలను తాకాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు తీవ్ర నష్టాలు చేశాయని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.






