- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనే పోరాటం చేస్తా: ఎమ్మెల్యే విరుపాక్షి హెచ్చరిక
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం యాటకల్లుకు చెందిన రైతు శేఖర్ ఉల్లి సాగు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool) ఆస్పరి మండలం యాటకల్లుకు చెందిన రైతు శేఖర్(Farmer Shekhar) ఉల్లి(onion) సాగు చేశారు. అయితే పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కలేదు. దీంతో అదే ఉల్లిని ట్రాక్టర్లతో తీసుకెళ్లి వంకలో పారపోశారు. దీంతో రైతు శేఖర్‌ను ఎమ్మెల్యే విరుపాక్షి పరామర్శించారు.
ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతులు కష్టాలు పడుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్నారు. రైతులు పండించిన ఉల్లి, పత్తి, మిరప పంటకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. ఉల్లికి రూ. 1200 గిట్టుబాటు ధర చెప్పినా ఏ రైతు దగ్గరా ఉల్లిని ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఉల్లికి ఒక హెక్టార్‌కు రూ. 50 వేలు ప్రకటించినా ఏమాత్రం సరిపోదని తెలిపారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే తాను రైతుల తరపున పోరాడుతూనే ఉంటానని ఎమ్మెల్యే విరుపాక్షి హెచ్చరించారు.






