- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు బస్సు ప్రమాదం.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు ఇవే!
by Kema Shiva Kumar |
కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో వేమూరి కావేరి సంస్థకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రమంలోనే అదే బస్సులో ప్రయాణిస్తున్న రమేశ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చారు. అందులో A1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, A2గా కావేరి ట్రావెల్స్ యజమాని పేర్లు ఉన్నాయి. అయితే, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంటూ ఇద్దరిపై BNS 125(a), 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






