Kumari Aunty : దేవుడి గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు కుమారి ఆంటీ పూజలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-19 05:44:26  IST  )

కుమారి ఆంటీ(Kumari Aunty)..ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్(Popular) ..ఆంధ్రకు చెందిన కుమారి ఆంటీ హైదరాబాద్ ఐటీ కారిడార్ ఐటీసీ కోహినూర్ జంక్షన్‌లో రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటు జీవనం సాగిస్తు తక్కువ ధరకు రుచికరమైన..నాణ్యమైన టిఫిన్లు, భోజనాన్ని అందిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Kumari Aunty : దేవుడి గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు కుమారి ఆంటీ పూజలు
X

దిశ, వెబ్ డెస్క్ : కుమారి ఆంటీ(Kumari Aunty)..ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్(Popular) ..ఆంధ్రకు చెందిన కుమారి ఆంటీ హైదరాబాద్ ఐటీ కారిడార్ ఐటీసీ కోహినూర్ జంక్షన్‌లో రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటు జీవనం సాగిస్తు తక్కువ ధరకు రుచికరమైన..నాణ్యమైన టిఫిన్లు, భోజనాన్ని అందిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీ హోటల్ ను ఓసారి ట్రాఫిక్ పోలీసులు తొలగించే ప్రయత్నం చేయడం..ఆ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుమారి ఆంటీ పేరు మారుమ్రోగింది.

టాలీవుడ్ నటులు సందీప్ కిషన్ , రాహుల్ రవీంద్రన్ లు దీనిపై స్పందించడం ఆమెను మరింత ఫేమస్ చేసింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కుమారీ ఆంటీ హోటల్ తొలగింపు ఆగిపోగా అప్పట్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. మరికొందరు ఫుట్ పాత్ వ్యాపారులైతే ట్రాఫిక్ నిబంధనల పేరుతో దుకాణాల తొలగింపులో కుమారి ఆంటీకి ఓ న్యాయం మాకో న్యాయమా అంటూ ఏకిపారేశారు. ఆ తర్వాతా నటుడు సోనుసూద్ ఆమెకు సహాయం చేయడం..ఇటీవల ఆమె ఇంటికి అతను రావడంతో మరింతగా కుమారి ఆంటీ పేరు వార్తల్లోకి ఎక్కింది.

తరుచు సోషల్ మీడియాలో పలు అంశాలపై పోస్టులు కూడా పెట్టే కుమారీ ఆంటీకి నెట్టింట కూడా చాలమంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా కుమారి ఆంటీ తన ఇంట్లో దేవుడి గదిలో దేవుళ్ల ఫోటోల(In The God's Room)తో పాటు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఫోటో (Photo)పెట్టుకుని నిత్యం పూజలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కుమారి ఆంటీ ఈ వీడియోలో తాను మహాకుంభమేళా(Mahakumbh Mela)కు వెలుతున్నానని..ముందుగా ఇంట్లో దేవుళ్లకు పూజలు చేసి బయలుదేరుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఈ వీడియోలో కుమారి ఆంటీ పూజలు చేస్తున్న దేవుడి గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు తన జీవనోపాధిని కాపాడిన సీఎం రేవంత్ రెడ్డి పట్ల కుమారీ ఆంటీ కృతజ్ఞత చాటుకుంటున్నారని .. మరికొందరేమో ...ఎంతైనా బతకనేర్చిన తెలివిలో ఆంధ్రోళ్ల తెలివే వేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘నాన్నా.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది’ అంటూ తన ఫుడ్‌తో పాపులర్ అయిపోయిన కుమారి ఆంటీ ఆ తర్వాత సెలబ్రిటీగా మారిపోయింది. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ నుంచి..మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ.. వరుసగా టీవీ షోలు చేస్తుంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో మూవీలో కూడా సందడి చేసింది. తెలంగాణ వరద బాధితుల కోసం ఆ మధ్య కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 వేల విరాళం అందించారు. కుమారి ఆంటీ భర్త, పిల్లలతో సహా రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని రేవంత్‌ రెడ్డి సన్మానించారు. తాజాగా ఓ వీడియోలో కుమారీ ఆంటీ క్రైస్తవ ప్రార్థన చేస్తుండటం కూడా వైరల్ అయ్యింది.

Next Story