- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణంరాజుకు ముగిసిన పోలీసు కస్టడీ.. మంగళగిరి కోర్టుకు తరలింపు
రాజధాని అమరావతి (Amaravati) ప్రాంత మహిళలను కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు (VVR Krishnam Raju)ను తుళ్లూరు (Thullur) పోలీసులు ఈ నెల 20న తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి (Amaravati) ప్రాంత మహిళలను కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు (VVR Krishnam Raju)ను తుళ్లూరు (Thullur) పోలీసులు ఈ నెల 20న తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల విచారణ అనంతరం ఆయనను ఇవాళ ఉదయం మంగళగిరి (Mangalagiri) ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. నేటితో పోలీసు కస్టడీ ముగుస్తుండటంతో నిందితుడు కృష్ణంరాజును పోలీసులు తిరిగి మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి తాను చేసిన దారుణమైన వ్యాఖ్యలని, తాను చేసింది తప్పేనని జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి (Amaravati) అక్కాచెల్లెమ్మలకు క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. తనకు ఉన్న బలహీనతను ‘సాక్షి’ మీడియా సంస్థ పావుగా వాడుకుందంటూ కృష్ణంరాజు స్టేట్‌మెంట్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.






