- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను లిక్కర్ జోలికి వెళ్లను.. నాకు సంబంధం లేదు: చెవిరెడ్డి
లిక్కర్ స్కామ్‌కు, తనకు సంబంధం లేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case)లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. 12 మంది నిందితులకు రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు బుధవారం ఏసీబీ కోర్టు(Acb Court)లో హాజరుపర్చారు. దీంతో వారికి ధర్మాసనం రిమాండ్ గడువు పొడిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy) మాట్లాడుతూ దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, లిక్కర్ స్కామ్‌కు, తనకు సంబంధం లేదని తెలిపారు. వందలాది మంది బ్రాహ్మణ పిల్లలకు ఉచితంగా వేద విద్య అందిస్తున్న తాను లిక్కర్ జోలికి వెళ్లనని చెప్పారు. చిన్నప్పటి నుంచి మద్యం అంటే తనకు ద్వేషమని తెలిపారు. మద్యం జోలికి వెళ్లకూడదనే సెంటిమెంట్ పెట్టుకున్నానన్నారు. కానీ ఈరోజు లిక్కర్ కేసులో తనను జైలుకు పంపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు అన్నీ చూస్తున్నారని, పోరాడి ఈ కేసు నుంచి బయటకు వస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.






