- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జిల్లాలో పర్యటించనున్న వైయస్ జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైకాపా అధినేత వైయస్ జగన్ (YS Jagan) నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారని పార్టీ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైకాపా అధినేత వైయస్ జగన్ (YS Jagan) నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారని పార్టీ పేర్కొంది. ఉదయం 9.30 గంటలకు వైయస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారని తెలిపారు. అక్కడ నుంచి జిల్లాలోని పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరు చేరుకుంటారని తెలిపింది. అక్కడి పర్యటన అనంతరం మధ్యాహ్నం అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లికి (Tadepalli) తిరిగి చేరుకుంటారని వెల్లడించింది.
పంట నష్టపోయిన రైతులకు పరామర్శ..
మొంథా తుఫాను (Cyclone Montha) ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు పంటను నష్టపోయారు. ప్రభుత్వం కూడా వారికి నష్టపరిహారం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో రైతులను ప్రత్యక్షంగా కలిసేందుకు వైయస్ జగన్ పర్యటన చేయనున్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులతో (Farmers) నేరుగా మాట్లాడనున్నారు. వారి సాధక బాధకాలను తెలుసుకొనున్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు సమాచారం.






