- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడాలి నానికి వైఎస్ జగన్ ఫోన్ !
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానికి ( Kodali Nani ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానికి ( Kodali Nani ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిన్న... మాజీ మంత్రి కొడాలి నాని కి గుండెకు సంబంధించిన ఏదో సమస్య వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని గుండెపోటుగా ప్రసారం చేశాయి. కొడాలి నాని... గ్యాస్ట్రో సమస్య కారణంగా.. ఆసుపత్రికి వెళ్లారని... ఆయన అనుచరులు ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాదులోని ప్రముఖ ఏఐజి ఆసుపత్రిలో ( AIG Hospital ) కొడాలి నాని అడ్మిట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు నిన్ననే వైరల్ అయ్యాయి. పేర్ని నాని ( Perni Nani) కూడా ఆసుపత్రికి వెళ్లి వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానిని పరామర్శించారు. అయితే కొడాలి నాని కి నిజంగా... ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చిందో తెలియదు కానీ... కాస్త ఎమర్జెన్సీ అని అంటున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ కొడాలి నాని కి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు జగన్మోహన్ రెడ్డి. అలాగే వైద్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని కి మెరుగైన వైద్యం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.






