- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలుకు వెళ్లక తప్పదు.. హౌసింగ్ అధికారులకు పేర్ని నాని వార్నింగ్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత ప్రభుత్వం జగనన్న హౌసింగ్ కాలనీకి కేటాయించిన స్టీల్‌ను హౌసింగ్ శాఖ అధికారులు తీసుకెళ్లారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతామని మాజీ మంత్రి పేరి నాని హెచ్చరించిన విషయం తెలిసిందే..

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా (Krishna District)మచిలీపట్నం(Machilipatnam)లో గత ప్రభుత్వం జగనన్న హౌసింగ్ కాలనీ(Jagananna Housing Colony)కి కేటాయించిన స్టీల్(Steel)ను హౌసింగ్ శాఖ అధికారులు(Housing Department officials) తీసుకెళ్లారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతామని మాజీ మంత్రి పేరి నాని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా హౌసింగ్ అధికారులను పేర్నినాని హెచ్చరించారు. తాను అధికారులను బెదిరించారని అధికార పార్టీ నేతలు అంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తానెవరినీ బెదిరించలేదని చెప్పారు. కానీ తప్పు చేసిన అధికారులు జైలుకు వెళ్లక తప్పదని మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. నోబుల్ కాలేజీ సత్రాన్ని తాను ఆక్రమించానని మంత్రి కొల్లు రవీంద్ర ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ కాలేజీ అద్దె ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర చెత్త రాజకీయాలు చేయొద్దని పేర్ని నాని సూచించారు.






