ప్రపంచ తెలుగు కవుల మహాసభలు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రపంచ తెలుగు కవుల మహాసభలు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాతృభాషా వికాసమే మానవ జాతి ప్రకాశమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాసభల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మన అస్తిత్వానికి మాతృభాషే సుస్థిరమైన కోట అని నేను బలంగా విశ్వసిస్తానని అన్నారు. మన సంస్కృతి, విలువలు, సంప్రదాయాలు అన్నీ భాషతోనే ముడిపడి ఉన్నాయని తెలిపారు. మన సాహిత్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మన నాలుకల మీద భాషను బతికించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

కోర్టు తీర్పులు ప్రజల భాషలోనే ఉండాలి

​భాష సామాన్యులకు సైతం చేరాలని, ముఖ్యంగా ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన వ్యవహారాలు, కోర్టు తీర్పులు కూడా ప్రజల భాషలోనే ఉండాలని చెప్పారు. నేటి సాంకేతిక యుగంలో కృత్రిమ మేధను సైతం మాతృభాషల అభివృద్ధికి వాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కవులు, రచయితలు మన భాషా సంస్కృతులను భవిష్యత్ తరాలకు అందించే వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాతృభాషా అభిమానులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story