- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: మొత్తం 12 మంది గుర్తింపు.. పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలు!
విజయవాడ నగరంలో కలకలం రేపిన టెర్రర్ లింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో కలకలం రేపిన టెర్రర్ లింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర కుట్రలో మొత్తం 12 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో విజయవాడ టూటౌన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహ్మద్ డానిష్‌లను అరెస్ట్ చేశారు. వీరిని సీఎంఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. విచారణ సందర్భంగా తాము న్యాయవాదిని నియమించుకోలేమని నిందితులు తెలపడంతో, ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం వారిని కేంద్ర కారాగారానికి తరలించారు.
సోషల్ మీడియా వేదికగా ఉగ్ర ప్రచారం..
కేసు వివరాలను ఐజీ ఎస్ఎస్. త్రిపాటి మీడియాకు వివరించారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా IQIS, ISIS పేర్లతో రెండు గ్రూపులను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక గ్రూపులో ఐదుగురు, మరో గ్రూపులో ఏడుగురు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వీరి ముఖ్య ఉద్దేశం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడమేనని ఐజీ స్పష్టం చేశారు. అరెస్టయిన ముగ్గురి నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పాక్ నుంచి నిధులు..
ఈ ముగ్గురు నిందితులు పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు నెరుపుతూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఉగ్రవాద రిక్రూట్‌మెంట్, జిహాదీ కార్యకలాపాల కోసం వీరికి పాక్ నుంచే నిధులు అందుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆన్లైన్ గ్రూపుల్లో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వీరు కేవలం డబ్బు కోసమే పని చేస్తున్నారా లేక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.






