- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు గమనిక: విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుర్గగుడి అధికారులు ప్రకటించారు. ..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakeeladri)పై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు(Kanaka Durga Temple Ghat Road)ను మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుర్గగుడి అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, పనులు పూర్తయ్యేంత వరకు ఘాట్ రోడ్డు గుండా వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్డు మూసివేత సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మార్గం ద్వారా లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని కొండపైకి చేరుకోవాలని అధికారులు సూచించారు. భక్తులంతా ఈ మార్పును గమనించి, ఆలయ సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరారు.






