లిక్కర్ కేసులో కీలక నిందితుడు లొంగుబాటు... రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-26 13:11:20  IST  )

లిక్కర్ స్కాం కేసులో ఏ7 నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డికి శుక్రవారం వరకు జడ్జి రిమాండ్ విధించారు. ఈ కేసులో లొంగిపోయిన అవినాష్‌రెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు...

లిక్కర్ కేసులో కీలక నిందితుడు లొంగుబాటు... రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో ఏ7 నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి(Muppidi Avinash Reddy)కి శుక్రవారం వరకు జడ్జి రిమాండ్ విధించారు. ఈ కేసులో లొంగిపోయిన అవినాష్‌రెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు ధర్మాసనం ఒక రోజు రిమాండ్ విధించింది. దీంతో నిందితుడు అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా లిక్కర్ కేసు నమోదు అయినప్పటి నుంచి అవినాష్ రెడ్డి పరారీ ఉన్నారు. అయితే గురువారం ఉదయం విజయవాడ సిట్‌ కార్యాలయం(Vijayawada Sit Office)లో లొంగిపోయారు. అంతకు ముందు నిందితుడు అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు(Supreme Court)లో ముందస్తు బెయిల్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు తిరస్కరించింది. అంతేకాదు ఏసీబీ పోలీసుల(Acb Police) ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో విజయవాడ సిట్‌ కార్యాలయంలో అవినాష్ రెడ్డి లొంగిపోయారు.

రిమాండ్ రిపోర్టులో....

ఇక అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో ముప్పిడి అవినాష్‌రెడ్డి పాత్ర కీలకమని తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 409, 420, 384, 201, 120 (B), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఏ-1 కెసిరెడ్డితో కలిసి రూ.కోట్ల మేర లావాదేవీలు చేశారని చెప్పారు. లిక్కర్ సిండికేట్‌తో కిక్‌బ్యాక్‌లు, కమీషన్ల ద్వారా లబ్ధి పొందారు. సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్త, ఆర్థిక నియంత్రణదారుగా వ్యవహరించారు. నేరపూరిత సొమ్మును మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా 'ఆర్డర్ ఫర్ సప్లై' కేటాయించారు. పాత పాపులర్ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారు. పారదర్శకంగా ఉన్న 'ఆటోమేటెడ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్' తీసివేశారు.’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Next Story