- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో అప్పుల తిప్పలు కన్నతల్లి ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న రఘువంశీ అనే యువకుడు జల్సాలకు అలవాటుపడి భారీగా అప్పులు(Debts) చేశాడు..

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట(Vissannapet)లో అప్పుల తిప్పలు కన్నతల్లి(Mother) ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న రఘువంశీ(RaghuVamsi) అనే యువకుడు జల్సాలకు అలవాటుపడి భారీగా అప్పులు(Debts) చేశాడు. వాటిని తీర్చడం కోసం విస్సన్నపేటలో ఉన్న తమ ఇల్లు అమ్మాలంటూ తన తల్లి రమాదేవిపై కొంతకాలంగా ఒత్తిడి తెచ్చాడు. అయితే ఇల్లు అమ్మడానికి ఆమె నిరాకరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న కుమారుడు దారుణంగా కొట్టి ఆమెను హతమార్చాడు.
నిందితుడి అరెస్ట్
ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన విస్సన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో కేవలం ఇల్లు అమ్మలేదనే కోపంతోనే రఘువంశీ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






