మళ్లీ మొదలైన తిరువూరు తిరునాళ్ల.. ఈసారి మార్ఫింగ్ ఫొటోలతో ఫైటింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-14 11:15:53  IST  )

తిరువూరు టీడీపీలో మళ్లీ రచ్చ మొదలైంది...

మళ్లీ మొదలైన తిరువూరు తిరునాళ్ల.. ఈసారి మార్ఫింగ్ ఫొటోలతో ఫైటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరువూరు టీడీపీలో మళ్లీ రచ్చ మొదలైంది. మొన్నటి వరకూ ఎంపీ కేశినేని నాని, విస్సన్నపేట మండలాధ్యక్షుడు.. ఇప్పుడు ఎమ్మెల్యే కొలికిపూడి వర్సెస్ స్థానిక టీడీపీ నేతలుగా మారింది. ఒకరి ఫొటోలు మరొకరు మార్ఫింగ్ చేసుకుంటూ వాట్సప్‌లో పెట్టుకుని మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఓ మహిళతో ఎమ్మెల్యే కొలికిపూడి సన్నిహితంగా ఉన్నట్లుగా మార్ఫ్ చేసిన ఫొటోలను కొన్ని వాట్సప్ గ్రూపుల్లో టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్ షేర్ చేశారు. అయితే ఎమ్మెల్యే కొలికిపూడి సైతం కౌంటర్‌గా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా రాజేశ్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఆయన వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీంతో తిరువూరు టీడీపీలో ముసలం మరోసారి బయటపడింది.

ఇటీవలె విస్సన్నపేట టీడీపీ నేతలతో కొలికిపూడి వివాదం జరిగింది. ఈ వ్యవహారం మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు మహిళతో మార్ఫింగ్ ఫొటోల రచ్చ కొనసాగుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్వయంగా హెచ్చరించినప్పటికీ తిరువూరు వ్యవహారం కొలిక్కిరాకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలతో కొనసాగుతున్న వివాదం ప్రస్తుతం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోందని సీనియన్ నేతలు అంటున్నారు.

Next Story