‘టీడీపీ ఎమ్మెల్యే కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు: పీఎస్‌లో ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుటుంబానికి ప్రాణభయం కలిగించేలా బెదిరింపులు వచ్చాయి. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు...

‘టీడీపీ ఎమ్మెల్యే కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు: పీఎస్‌లో ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్(Penamalur MLA Bode Prasad) కుటుంబానికి ప్రాణభయం కలిగించేలా బెదిరింపులు వచ్చాయి. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాలంపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తన కుటుంబాన్ని అంతమొందిస్తానంటూ హెచ్చరించాడని పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలు సేకరించిన పెనమలూరు పోలీసులు నిందితుడిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాలంపాటి భాస్కర్ రెడ్డి నిందితుడిగా గుర్తింపు

అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాలంపాటి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో కేసులు నమోదై ఉన్నాయి. విదేశాల్లో ఉంటూనే ఎమ్మెల్యే కుటుంబానికి బెదిరింపులకు పాల్పడిన ఈ వ్యవహారంపై పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితుడి వివరాలను సేకరిస్తున్నారు.

Next Story