ఇదెక్కడి వింత.. మిరప చెట్టుకు టమాటాలు

by Thanuru Gopichand |

కాలం మారింది అంటే ఏంటో అనుకుంటూ ఉంటాం..

ఇదెక్కడి వింత.. మిరప చెట్టుకు టమాటాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాలం మారింది అంటే ఏంటో అనుకుంటూ ఉంటాం.. కానీ పర్యావరణ (Nature) మార్పుల ద్వారా కాలం తన సహజత్వాన్ని కోల్పోతుందని పలుమార్లు ప్రకృతి మనకు గుర్తు చేస్తుంది. అటువంటి ఒక వింత ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్లపాడు గ్రామానికి చెందిన ముత్యాల రజిత రమేశ్ మిరపతోట (Mirapa Thota) వేశారు. ఆ మిరపతోటలోని మిరపచెట్టుకు మిరపకాయలకు బదులుగా టమాటా, వంకాయలు (Brinjal) కాసాయి. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగువారు, సమీప గ్రామాల వారు మిరపతోటకు తరలివచ్చి వింతను గమనించసాగారు. మిరపచెట్టుకు టామాటాలు, వంకాయలు కాయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఇది దేవుడు (Act Of God) చేసిన అద్భుతం అంటూ ఉంటే.. మరి కొందరు శాస్త్రీయ (Scientific) కారణం ఉండే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్థానిక వ్యవసాయ అధికారులు పరిశీలన ప్రారంభించినట్లు సమాచారం.

Next Story