- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: కృష్ణలంక పీఎస్ వద్ద ఉద్రిక్తత.. వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్(KrishnaLanka Police Station) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ(Ycp Leader Vallabhanenai Vamsi)ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే వల్లభనేని వంశీని కలిసేందుకు ఆయన భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వంశీని కలిసేందుకు తనకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. అయినా సరే ఎంతకీ అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం వంశీ బాగానే ఉన్నారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడంలేదు. రిమాండ్ లోకి తీసుకున్నప్పుడు అన్నీ చెబుతామన్నారు. పోలీసులు ఇప్పటికి వరకూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.’’ అని వంశీ భార్య పంకజశ్రీ పేర్కొన్నారు. కక్షపూరితంగా వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని వంశీ లాయర్ ఆరోపించారు.
మరోవైపు వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్(Hyderabad)లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ కోర్టు(Sc, St Court)లో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.






