- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : హోం మంత్రి అనిత
by Thanuru Gopichand |
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి నాగేంద్ర స్వామి వారిని వేడుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి నాగేంద్ర స్వామి వారిని వేడుకున్నారు. నాగుల చవితిని పురస్కరించుకొని విజయవాడలోని అయ్యప్పనగర్ లో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి హోం మంత్రి వెళ్లారు. నాగ లింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం దేవాలయ ఆవరణలోని నాగ దేవత పుట్టలో పాలను పోశారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో హోం మంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత వంగలపూడి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. నాగదేవతల చల్లని చూపు, ఆశీస్సులు ప్రజలపై ఉండాలన్నారు.
Next Story






