- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ, జనసేన మధ్య రొయ్యల గొడవ.. మహిళా చైర్ పర్సన్‌పై దాడి
రొయ్యల చెరువు లీజు వ్యవహారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టింది. రొయ్యల చెరువును యాజమాన్యం వద్ద రంగారావు అనే వ్యక్తి లీజు తీసుకున్నారు. ఈ మేరకు రొయ్యల విక్రయం జరుగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: రొయ్యల చెరువు లీజు వ్యవహారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టింది. రొయ్యల చెరువును యాజమాన్యం వద్ద రంగారావు అనే వ్యక్తి లీజు తీసుకున్నారు. ఈ మేరకు రొయ్యల విక్రయం జరుగుతోంది. దీంతో లీజు డబ్బులు ఇస్తున్న సమయంలో టీడీపీ నేత రేగళ్ల శ్రీను అడ్డుకున్నారు. లీజు డబ్బులను బలవంతంగా లాక్కుకున్నారు. అయితే శ్రీను తీరుపై రాష్ట్ర వడ్డీల వెల్ఫేర్ డెవలప్ మెంట్ చైర్ పర్సన్ ఘంటశాల వెంకటలక్ష్మికి రంగారావు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనుపై ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న శ్రీను అనుచరులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి వెంకటలక్ష్మితో గొడవకు దిగారు. అంతేకాదు పోలీసుల సమక్షంలో బూతులు తిడుతూ ఆమెపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కృష్ణా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన నేతలే పరువును బజారుకీడ్చడంపై మిగిలిన నేతలు మండిపడుతున్నారు. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జనసేన, టీడీపీ నేతల తీరుపై వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. రొయ్యల చెరువుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.






