- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ టెస్టుల్లో 30 మందికి పాజిటివ్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపారు

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr Disrtrict) జగ్గయ్యపేట నియోజకవర్గం(Jaggayyapeta Constituency)లో మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ రవాణా, వినియోగం(Drug Trafficking, Consumption)పై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు.. నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో మెరుపు దాడులు నిర్వహించి ఒకేసారి 112 మందికి డ్రగ్స్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. కొంతకాలంగా అనుమానిత ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
ఈ ముమ్మర తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పరీక్షలు నిర్వహించిన వారిలో ఏకంగా 30 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలడం స్థానికంగా కలకలం రేపింది. డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వీరందరినీ పోలీసులు తక్షణమే కౌన్సెలింగ్ ఇచ్చి, మెరుగైన చికిత్స కోసం డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉండాలని, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






