- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటరి జంటలే టార్గెట్: గ్యాంగ్ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోకిరీల బెడద మరీ ఎక్కువ అయిపోయింది. ...

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా నందిగామ(Nandigama)లో పోకిరీల(Hooligans) బెడద మరీ ఎక్కువ అయిపోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా హల్ చల్ చేస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతోంది. ఖాళీగా తిరుగుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై జనాలను అడ్డుకుంటూ డబ్బులు లాక్కుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకాడటం లేదు. ఇక జంటలు కనిపిస్తే ఆ వేధింపులే వేరు. ఆడవాళ్లనైతే ఇష్టమొచ్చిన చోట్ల తాకుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి గ్యాంగ్ ఒకటి చేసిన ఆరాచకాలు కృష్ణా జిల్లా నందిగామలో వెలుగులోకి వచ్చాయి. అయితే అది ఎవరి ఫిర్యాదుతోనో కాదు. వాళ్లలో వాళ్లకే గొడవులు రావడంతో చేసిన దరిద్రపు పనులు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్ మొత్తాన్ని అదుపులోకి తీసుకుని పాత ఖాతాలన్నింటిని బయటకు లాగుతున్నారు.
మద్యానికి బానిసై..
కాగా నందిగామకు కొందరు యువకులు మద్యానికి బానిసయ్యారు. ఈజీ మనీ కోసం గ్యాంగులు ఏర్పడ్డారు. రాత్రి సమయంలో రోడ్డులపై తిరుగుతూ స్థానికులను బెదిరించుకుంటూ వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, నగదు లాక్కుని అమ్ముకుని మద్యం తాగుతున్నారు. ఇదిలా ఉంటే వీరిలోని రెండో కోణం సైతం తాజాగా బయటపడింది. స్థానికులనే కాకుండా ఒంటరి జంటలను కూడా ఈ గ్యాంగ్ సభ్యులు టార్గెట్ చేశారు. పార్కులు, ఖాళీ ప్రదేశాల్లో కాలక్షేపం కోసం వెళ్లిన జంటలను అటకాయించి వారి నుంచి డబ్బులు దోచుకున్నారు. అలాగే వారి వీడియోలను సైతం సెల్ ఫోన్లలో రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డి మళ్లీ మళ్లీ వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. కొన్ని సమయాల్లో వారిపై ఆగయిత్యాలకు కూడా పాల్పడ్డారు. అయితే డబ్బుల వాటాల్లో గొడవలు రావడంతో రోడ్డుపై ముఠా సభ్యులు ఘర్షణ పడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువలకుల సెట్ ఫోన్లో ఒంటరి జంటల వీడియోలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. నందిగామలో జరిగిన అనుమానాస్పద ఘటనలపైనా ఆరా తీస్తున్నారు.






