- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayawada: నలుగురు మావోయిస్టులకు రిమాండ్.. జైలుకు తరలింపు
విజయవాడ పడమన పోలీస్ స్టేషన్ పరిథిలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు జడ్జి రిమాండ్ విధించారు...

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల(Maoists) ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’(Operation Kagar) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరికొన్ని చోట్ల జరిపి కూంబింగ్‌లో కొందరు మవోయిస్టులు అరెస్ట్ అయ్యారు.
తాజాగా రాష్ట్రంలోనూ ఆపరేషన్ కగార్ కొనసాగింది. మంగళవారం విజయవాడ(Vijayawada)లో27 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. అయితే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్(West Police Station) పరిధిలోనూ నలుగురు మావోయిస్టులను అదుపులోకి విచారించారు. ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారికి జడ్జి రిమాండ్ విధించారు. డిసెంబర్ 3 వరకు రిమాండ్ విధించడంతో పాటు నలుగురు మావోయిస్టులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఈ మేరకు మేరకు నలుగురు మావోయిస్టులను విజయవాడ నుంచి నెల్లూరుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.






