ఖైదీతో సిట్టింగ్.. ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-15 03:47:08  IST  )

కృష్ణా జిల్లాకు చెందిన ఎస్సార్ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది...

ఖైదీతో సిట్టింగ్.. ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District)కు చెందిన ఎస్సార్ సిబ్బందిపై ప్రభుత్వం(Government) వేటు వేసింది. ఖైదీ(Prisoner) కలిసి హోటల్‌లో టిఫిన్ చేసినందుకు వారిపై చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో పోస్టు కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యారు. అయితే వాయిదాల విషయంలో జైలుకు, కోర్టుకు తరలించేందుకు సమయంలో ఖైదీతో కలిసి ఎస్సార్ సిబ్బంది ప్రసాద్, శివప్రసాద్, కిరణ్, సురేష్, ఏఎస్సై శ్రీనివాస్ టిఫిన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు ఎస్సార్ట్ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు ఎస్సార్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story