జనసేనలోనూ షురూ.. ఢీ అంటే ఢీ అంటున్న నేతలు

by Vemula.Srinu Prasad |

కృష్ణా జిల్లా పెనమలూరు జనసేనలో వర్గపోరు కొనసాగుతోంది...

జనసేనలోనూ షురూ.. ఢీ అంటే ఢీ అంటున్న నేతలు
X

దిశ, వెబ్ బెస్క్: జనసేన(Janasena) పార్టీలోనూ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ(Tdp)లోనే అనుకుంటే పవన్ పార్టీలోనూ ఏదో ఒకచోట వర్గపోరు బయటపడుతోంది. అయితే అవి అధిష్టానం వరకు వెళ్లకపోవడంతో ఇటీవల ఈ పంచాయితీలు అధికమయ్యాయి. ఇటీవల గూడూరు నియోజకవర్గంలో జనసేన నేతలు, కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణతో పలువురికి గాయాలై ఆస్పత్రి పాలయ్యారు.


ఈ వివాదాన్ని మర్చిపోకవముందే కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు(Penamaluru)లోనూ జనసేన నేతల మ‌ధ్య వర్గ పోరు బయటపడింది. జ‌న‌సేన నాయ‌కుడు గ‌ణేష్‌పై మరో వ‌ర్గం నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. స్థానిక రైతు బజార్‌లో షాపులు, ఇసుక వ్యాపారంతో డబ్బులు సంపాదించాడని గణేష్‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అంతేకాదు గత సంక్రాంతి సమయంలో కోడిపందాలు నిర్వహించాడని, ఆధారాలతో గణేష్‌పై జనసేన ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీని రోడ్డు మీదకు తీసుకొచ్చాడని, గణేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అంశం పెనమలూరు రాజకీయాల్లో చర్చగా మారింది. మరి జనసేన పార్టీ అగ్రనాయకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story