- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెరపైకి రూ.5 కోట్ల వివాదం.. కృష్ణా జిల్లా టీడీపీలో పెను ప్రకంపనలు
విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదిరింది..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ చిన్ని(Vijayawada Mp Chinni), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్(Tiruvuru Mla Kolikipudi Srinivas) మధ్య వివాదం మరింత ముదిరింది. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని కొలికిపూడి ఆరోపించారు. అంతేకాదు 2024 ఫిబ్రవరిలో మూడు విడతలుగా రూ. 60 లక్షలు ఇచ్చానని ఆయన తెలిపారు. ఆ తర్వాత చిన్ని పీఏ మోహన్ వచ్చి రూ. 50 లక్షలు తీసుకెళ్లారని పేర్కొన్నారు. మిగిలిన మూడున్నర కోట్ల లావాదేవీలపై శుక్రవారం వివరిస్తానని కొలికిపూడి పేర్కొన్నారు. నిజం గెలవాలని, నిజమే గెలవాలని ఆకాంక్షించారు.
అయితే కొలికిపూడి వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను కోవర్టులకు పదవులు ఇచ్చే వ్యక్తిని కాదన్నారు. ఎవరు ఏ పంచన చేరారో అందరికీ తెలుసన్నారు. తాను డబ్బులకు పదవులు అమ్ముకునే వ్యక్తిని కాదన్నారు. డబ్బులు సంపాదించుకునేందుకు తనకు చాలా వ్యాపారులున్నాయని చిన్ని తెలిపారు. ఎవరు ఎలాంటి వాళ్లో జిల్లా పార్టీలో తెలుసన్నారు. చంద్రబాబును అవమానించిన వారికి టికెట్లు అసలు ఇవ్వమని చిన్ని స్పష్టం చేశారు.






