అన్నా క్యాంటీన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-16 09:15:24  IST  )

అన్నా క్యాంటీన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు..

అన్నా క్యాంటీన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటన్లను ప్రారంభించారు. ప్రతిరోజు పేదలకు అల్ఫాహారం అందిస్తున్నారు. అయితే ఈ రోజు కృష్ణా జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాంధీనగర్‌లోని అన్న క్యాంటీన్‌కు కలెక్టర్ లక్మీశ ఆకస్మిక తనిఖీ చేశారు. అల్పాహారం కోసం క్యాంటీన్‌కు వ‌చ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ స‌మ‌యానికి తెరుస్తున్నారా?, ఆహార ప‌దార్థాల నాణ్యత ఎలా ఉంది?. ఏమైనా ఫిర్యాదులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆహార ప‌ట్టిక‌, టోకెన్ కౌంట‌ర్‌, ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డిస్తున్న స్థ‌లం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లను ఆయన ప‌రిశీలించారు.

అన్న క్యాంటీన్ ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండాల‌ని, అప‌రిశుభ్రత అనేది మ‌చ్చుకైనా క‌నిపించ‌కూడ‌ద‌ని క‌లెక్టర్ జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహార ప‌దార్థాల‌ను అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ఆక‌లితో ఉన్నవారికి ప‌ట్టెడ‌న్నం పెట్టడంలో ఉన్న ఆనందం మ‌రెక్కడా ల‌భించ‌ద‌న్నారు. ప్రతి క్యాంటీన్‌లోనూ అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పించాలని, ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ల నిర్వహ‌ణ‌కు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లకు బాధ్యత‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌ని క‌లెక్టర్ జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

Next Story