- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో థార్ జీపుల హంగామా కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో థార్ జీపుల(Thar jeeps)తో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో కార్లను ఢీకొట్టుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. పట్టుబడ్డ నిందితుడు బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లు తేలింది. రక్తనమూనాలు పరీక్షించడంతో ఓంకార్‌కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మరోవైపు పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్టెరాయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు తరలించారు. యువతి కోసమే విజయవాడలోని 100 అడుగుల రోడ్డులో బొల్లా ఓంకార్, లింగమనేని రోహిత్ థార్ కార్లతో బీభత్సం సృష్టించినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో యువతి ఓ కారులో ఉన్నట్లు స్థానిక సీసీ ఫుటేజుల్లో రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ యువతి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజులను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.






