విజయవాడలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉద్రిక్తత.. సిలిండర్ల కోసం ప్రజల ఆందోళన

by Vemula.Srinu Prasad |

విజయవాడలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిలిండర్లకోసం ప్రజలు పెద్ద ఎత్తున ఖాళీ సిలిండర్‌తో క్యూకట్టారు. ...

విజయవాడలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉద్రిక్తత.. సిలిండర్ల కోసం ప్రజల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిలిండర్ల(Cylinders) కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఖాళీ సిలిండర్‌తో క్యూకట్టారు. సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. మాన్యువల్‌గానైనా స్లిప్పులు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వెంటనే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏజెన్సీల వద్ద ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ వినియోగదారులు ఎండలోనే బారులు తీరారు. ఖాళీ సిలిండర్లతో ఉదయం నుంచే పడిగాపులు కాశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాన్యువల్‌గా స్లిప్పులు ఇవ్వడంతో ఫుల్ సిలిండర్లు తీసుకెళ్తున్నారు.

Next Story