- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుణదలలో ఉద్రిక్తత: నీటి మళ్లింపును నిరసిస్తూ గుంతలోకి దిగిన దేవినేని అవినాష్
గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గుణదల పడవలరేవు సెంటర్‌లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గుణదల పడవలరేవు సెంటర్‌లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
పైప్‌లైన్ పనుల అడ్డగింపు..
నీటి తరలింపు కోసం చేపట్టిన పైప్‌లైన్ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. నిర్మాణం కోసం తవ్విన గోతిలోకి దిగి దేవినేని అవినాష్ తన నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను పక్కనబెట్టి ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భారీగా పోలీసుల మోహరింపు
నిరసనకారుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.





