- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బందరులో టిడిపి-బిజెపి మధ్య పేచీ!!
మచిలీపట్నం బందరులో (Machilipatnam Bandar) కూటమి పార్టీల మధ్య పేచీ వచ్చింది. విగ్రహ ఏర్పాటు విషయమై ఇరు పార్టీ నేతల మధ్య వివాదం తలెత్తింది.

దిశ, వెబ్ డెస్క్ : మచిలీపట్నం బందరులో (Machilipatnam Bandar) కూటమి పార్టీల మధ్య పేచీ వచ్చింది. విగ్రహ ఏర్పాటు విషయమై ఇరు పార్టీ నేతల మధ్య వివాదం తలెత్తింది. ఒకరికొకరు తగ్గేది లేదన్నట్లుగా బలప్రదర్శనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే బందరులో వాజ్ పేయీ విగ్రహం ఏర్పాటు చేయాలని స్థానిక బిజెపి నాయకులు నిర్ణయించారు. అందులో భాగంగా విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఈ విషయాన్ని కూటమిలో భాగస్వాములైన పలువురు స్థానిక టిడిపి నేతలు వ్యతిరేకించారు. వాజ్ పేయీ విగ్రహ ఏర్పాటుకు ససేమిరా ఒప్పుకునేది లేదని మొండికి దిగారు. అందుకు బదులుగా మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రంగంలోకి దిగారు. తమతో పాటు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. బందరులోని సర్కి్ల్ విగ్రహ ఏర్పాటుకు యత్నించారు. ఆ యత్నాన్ని బిజెపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం తలెత్తింది. మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు వెంటనే చేరుకున్నారు. వివాదం మరింద ముదిరిపోక ముందే ఎలాగైనా ఇరు వర్గాలను సముదాయించాలని ప్రయత్నం ప్రారంభించారు. టిడిపి నేతల వద్ద నుంచి మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి తరలించారు. అటు బిజెపి, ఇటు టిడిపి నేతలను సముదాయించి తాత్కాలికంగా వివాదం సద్దుమణగేలా పోలీసుల చేశారు. అయితే సర్కిల్ పేరు రికార్డుల్లో ఎన్టీఆర్ సర్కిల్ గా ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. అలాంటిది అక్కడ వాజ్ పేయీ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం కారణంగా స్థానిక కూటమి నేతల మధ్య చీలికలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోందని పలువురు సీనియర్ లీడర్లు అంటున్నారు. ఇరు పార్టీల పెద్దలు కలుగజేసుకొని వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని సూచిస్తున్నారు.






