- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైలవరంలో ఒక్కసారిగా భారీ వర్షం.. ప్రజలకు ఊపశమనం
by Vemula.Srinu Prasad |
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ మార్పు తీవ్ర ఉపశమనాన్ని ఇచ్చింది...

X
దిశ , వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR District) మైలవరం నియోజకవర్గం(Mylavaram Constituency)లో వాతావరణం(Weather) ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ మార్పు తీవ్ర ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే వర్షంతో పాటు ఈదురుగాలులు బలంగా వీయడంతో మైలవరంతో పాటు పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బలమైన గాలుల కారణంగా రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడి వాహనదారులకు ఇబ్బంది ఎదురైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమం కాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు సైతం ఈ వర్షం కొంత ఆశాజనకంగా మారింది
Next Story






