- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుకాణంలో లక్షల కొద్ది దొంగ నోట్లు.. పోలీసుల రైడ్‌తో గుట్టు రట్టు
రాష్ట్రంలో కొందరు దుండగులు దొంగ నోట్లను మార్పిడి చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొందరు దుండగులు దొంగ నోట్లను మార్పిడి చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. లక్షలకు లక్షలు అసలు నోట్ల ముసుగులో చెలామణి చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా దొంగనోట్లు జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. క్రయ, విక్రయాల్లో యదేచ్ఛగా మార్పిడీ అవుతున్నాయి. ఎక్కడైనా ఒకటి అరా బ్యాంకులు గుర్తిస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తున్నారు. కానీ ఒకేసారి లక్షల్లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. దొంగనోట్లపై నిషేధం ఉన్నా ఏదో ఒక చోట ప్రతి రోజు నకిలీ నోట్ల గుట్టురట్టు అవుతోంది. దీంతో రాష్ట్రంలో ‘‘ఎన్ని నోట్లు ఉన్నాయి. ఎక్కడ ఫ్రింట్ అవుతున్నాయి. ఎలా మార్పిడీ అవుతున్నాయి. దీని వెనుకున్న సూత్ర, పాత్ర ధారులు ఎవరు..?’’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కృష్ణా జిల్లాలో కలకలం..
తాజాగా కృష్ణా జిల్లాలో నకిలీ నోట్లు లభ్యంకావడం ప్రస్తుతం చర్చగా మారింది. కత్తి వెన్ను మండలం సంగమూడిలో ఓ వైన్ షాపు ఉంది. అయితే ఆ షాపునకు ఓ వ్యక్తి వెళ్లారు. తనకు నచ్చి బ్రాండ్ అడిగారు. డబ్బులు తీసి ఇచ్చారు. అయితే అది ఫేక్ అని మద్యం షాపు నిర్వాహకులు గుర్తించారు. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రంజిత్ సింగ్, బ్రహ్మ ఉమాశంకర్, దిలీప్ గా గుర్తించారు. నిందితుల నుంచి రూ. 6 లక్షల విలువైన నకిలీ నోట్లు, ప్రింటింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల గుట్టు వెనుక ఎవరున్నారో కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.






