Machilipatnam: హోంమంత్రి అనిత పర్యటనలో భద్రతాలోపం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 16:50:53  IST  )

హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో భద్రతాలోపం వెలుగు చూసింది..

Machilipatnam: హోంమంత్రి అనిత పర్యటనలో భద్రతాలోపం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) పర్యటనలో భద్రతాలోపం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఇంటికి వెళ్లేందుకు ఈ సాయంత్రం హోంమంత్రి అనిత పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఈ పర్యటనలో ఉద్రిక్తలను సృష్టించేందుకు కొందరు వైసీపీ మహిళలు ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. దీంతో మచిలీపట్నం పర్యటనను హోంమంత్రి వాయిదా వేసుకున్నారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లకుండా వెనుతిరిగారు. అయితే వైసీపీ నేతలకు కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి సహకరిస్తున్న పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story