- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. అర్ధరాత్రి వరకు కొనసాగిన విచారణ
ఏపీలో కలకలం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో కలకలం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. (జూన్ 21) నిన్న అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ హార్డ్‌డిస్క్‌లు, డీవీఆర్‌లను కృష్ణలంక పోలీసులు (సోమవారం) నేడు కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించనున్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేషన్ సీసీటీవీ రికార్డులు, సీఐ నాగరాజు కాల్‌డేటాను భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే సంబంధిత డేటాను సీజ్ చేసి బ్యాకప్ పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా, కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. మూడు రోజులుగా సేకరించిన సాంకేతిక ఆధారాలు, పోలీసుల వాంగ్మూలాలతో కూడిన నివేదికను ఏసీపీ దైవప్రసాద్ సిట్‌కు సమర్పించారు. ఆ నివేదికపై సిట్ చీఫ్ రవిప్రకాశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, తదుపరి విచారణ దిశపై సభ్యులతో చర్చించారు. ఏసీపీ నివేదికతో పాటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని రేపటి నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు అధికారుల సమాచారం.






