- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేర్ని నానికి నోటీసులు..పెడన వెళ్లొద్దని ఆదేశం
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు జారీ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)కి పోలీసుల నోటీసులు జారీ చేశారు. పెడనకు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. పెడనలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ(Babu Surety.. Fraud Guarantee) కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేవంటూ ఆయనకు నోటీసులు చేశారు.
కాగా గుడివాడలో వైసీపీ నేతలు శనివారం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కొడాలి నానికి చెందిన కే.కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ సమయంలో వైసీపీ చైర్ పర్సన్ ఉప్పల హరిక అటుగా వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆమె కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు ధ్వంసం అయింది. ఈ విషయం వైసీపీ శ్రేణులకు తెలియడంతో వాళ్లు కూడా నాగవరప్పాడు జంక్షన్ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ దృష్ట్యా పెడనలో నిర్వహిస్తున్న బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నించారు. దీంతో అనుమతి లేదంటూ పేర్ని నానికి నోటీసులు జారీ చేశారు.






