- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగి రమేశ్ ఇంటికి ఫోరెన్సిక్ బృందాలు.. కీలక ఆధారాల సేకరణ
జోగి రమేశ్ ఇంటి వద్ద కీలక ఆధారాలను పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh)పై అసభ్యరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విజయవాడ ఇబ్రహీంపట్నం(Vijayawada Ibrahimpatnam)లో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఇంటిపై టీడీపీ(Tdp) నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై 40 టీడీపీ నేతలపై పోలీసుల కేసు నమోదు చేసి 11 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే జోగి రమేశ్ కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీసుల మరింత దూకుడు పెంచారు.
రమేశ్ ఇంటికి పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు
తాజాగా జోగి రమేశ్ ఇంటికి పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు వెళ్లారు. ఇంటిపై దాడికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరారని ఇప్పటికే జోగి రమేష్ ఆరోపించారు. దీంతో పెట్రోల్ బాంబులు పేలిన చోట శాంపిల్స్‌ను సేకరించారు.






